తీర్పు 9వ తరగతి నోట్స్ PDF

Document Details

Uploaded by Deleted User

జి.పి. ఉ. పాఠశాల, వీరవల్లిపాలెం, 코నసీమ

కె. బాలకృష్ణ

Tags

telugu telugu_literature telengu_language textbook

Summary

ఈ PDFలో 9వ తరగతి తెలుగు (ప్రథమ భాష) పాఠ్యపుస్తకం నుండి "తీర్పు" అధ్యాయం, ప్రశ్నలు, సమాధానాలు ఉన్నాయి. తెలుగు భాషా అంశాలపై దృష్టి పెట్టే విద్యార్థులకు ఈ నోట్స్ ఉపయోగకరంగా ఉండవచ్చు.

Full Transcript

తెలుగు పరిమళం-9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమ భాష) 6.తీర్పు ★ అవగాహన- ప్రతిస్పందన ఇ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి. 1. ఆకాశంలో సంచరిస్తు న్న హంసల గుంపును కవి ఎలా వర్ణించాడో చెప్పండి. జ. ఆకాశవీధిలో అందమైన హంసల గుంపు బారులు...

తెలుగు పరిమళం-9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమ భాష) 6.తీర్పు ★ అవగాహన- ప్రతిస్పందన ఇ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి. 1. ఆకాశంలో సంచరిస్తు న్న హంసల గుంపును కవి ఎలా వర్ణించాడో చెప్పండి. జ. ఆకాశవీధిలో అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహారం చేయడం కనిపించింది. అవి మహాకవి ఆలోచనలు అనే ఆకాశవీధిలో గొప్ప రసార్ద్రభావంతో సంచారం చేస్తు న్న సరస్వతీదేవి పాదాల సవ్వడిలా విలాసంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. 2. హంస ఎలా గాయపడింది? జ. ఆకాశంలో విహరించే హంసను దేవదత్తు డు కఠోరమైన బాణంతో క్రూ రంగా కొట్ట గా బాణం తగిలి హంస క్రేంకారం చేస్తూ సిద్ధా ర్ధు ని పాదాల చెంత పడింది. 3. దేవదత్తు డు, గౌతములలో మీకు ఎవరి పాత్ర నచ్చింది? ఎందుకో చెప్పండి. జ. గౌతముని పాత్ర నాకు నచ్చింది. దయార్ద్ర హృదయంతో గాయపడ్డ హంసను రక్షించాడు. శుద్ధోదన మహారాజు సభలో జీవకారుణ్యాన్ని చూపించి సభాసదుల మన్నలను పొ ందాడు. మానవులంతా మానవత్వంతో జీవించాలని జాగృతి పలికాడు. ఆ) కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రతి సంవత్సరం ఆ ఉత్సవం ఎంతోమందికి మానసిక ఆనందాన్ని, చక్కటి విందును ఇస్తు ంది……………… …………………. ఆ ధీశాలి ఎవరో కాదు అనితర సాధ్యమైన పో రాటంతో ఎన్నో దురాచారాలు రూపుమాపిన సంఘసంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్. ప్రశ్నలు- జవాబులు : 1. జంతుబలిని అడ్డు కొని ప్రజల ఆగ్రహానికి గురైన ధీశాలి ఎవరు ? జ. జంతుబలిని అడ్డు కుని ప్రజల ఆగ్రహానికి గురైన ధీశాలి రాజారామ్ మోహన్ రాయ్. 2. పై పేరాలో మాట్లా డడం అని అర్థం వచ్చే పదం ఏది? జ. పై పేరాలో మాట్లా డటం అని అర్థం ఇచ్చే పదం ప్రసంగించడం. 3. 'విస్తు పో వడం' అనే పదాన్ని ఉపయోగించి సొ ంత వాక్యం రాయండి. జ. విస్తు పో వడం = ఆశ్చర్యపో వుట రవి, రాములిరువురు చేసే సర్కస్ విన్యాసాలను చూసి ప్రజలంతా విస్తు పో యారు. 4. ఆజ్ఞా పించడం అంటే జ. ఆదేశించడం 5. పై పేరాకు శీర్షిక రాయండి. జ. గొప్ప సంఘసంస్కర్త ఇ) కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సభక్త జిన్ పాదుషా మొదట్లో చాలా బీదవాడు. అతను ఓ మామూలు సిపాయిగా జీవితం గడుపుతూ వుండేవాడు.…………………………………… తదనంతర కాలంలో అతను చక్రవర్తి అయి గొప్ప కీర్తి ప్రతిష్ట లు సంపాదించాడు. ప్రశ్నలు జవాబులు: 1. సభక్త జిన్ ఎలా జీవించేవాడు ? జ. సభక్త జిన్ సిపాయిగా జీవితం గడుపుతూ ఉండేవాడు. 2. సభక్త జిన్ తన గుర్రం వెంట పరిగెత్తి వస్తు న్న తల్లి జింకను చూచి ఏమనుకున్నాడు ? జ. తన వెంట వస్తు న్న తల్లి జింకను చూచి ఆశ్చర్యపో యాడు. వెంటనే అతని హృదయం కరిగిపో యింది. 3. 'గాలించడం' అంటే అర్థం ఏమిటి ? జ. గాలించటం అంటే వెదకడం అని అర్థం. 4. పై పేరా నుంచి ఏదైనా ఒక ఆలోచనాత్మక ప్రశ్నను రాయండి. జ. తల్లి ప్రేమ ఎటువంటిదో తెల్పండి. 5. 'హృదయం కరగడం' ఉపయోగించి ఒక సొ ంతవాక్యం రాయండి. జ. పేద ప్రజల జీవనవిధానం చూడగానే మదర్ థెరిసా హృదయం కరిగింది. రూపకల్పన: కె.బాలకృష్ణ , పాఠశాల సహాయకులు (తెలుగు), జి.ప ఉ.పాఠశాల, వీరవల్లిపాలెం, కోనసీమ 📞 9492258533 తెలుగు పరిమళం-9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమ భాష) ★ వ్యక్తీకరణ - సృజనాత్మకత అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి. 1. గౌతముడు, దేవదత్తు ని మధ్య హంస గురించి జరిగిన సంవాదాన్ని రాయండి. జ. ఆకాశమార్గ ంలో వెడుతున్న హంసను చూచి దేవదత్తు డు ఒక వాడి బాణంతో కొట్టెను. అది విలవిలలాడుతూ గౌతముని ముందర పడింది. గౌతముడు వెంటనే దాని రక్షించాడు. అంత దేవదత్తు డు. నేను నా బాణంతో కొట్ట గా కింది పడింది. కనుక నా వస్తు వు నాకీయవలసింది అనెను. కాని గౌతముడు నాచే రక్షింపబడింది కనుక ఇది నాది అన్ని పల్కెను. ఇరువురునూ నాదంటే నాది యని తగవులాడుకునిరి. 2. హంస గౌతమునిదే అని నిర్ధా రణ ఎలా జరిగిందో మీ సొ ంతమాటల్లో రాయండి. జ. హంసను ఉంచిన రత్న వీఠం వద్ద కు దేవదత్తు డు చేరుకొని గంభీరంగా పిచ్చాడు. కాని హంస భయంతో వెనక్కు తగ్గి కుంగిపో యింది. తర్వాత గౌతముడు - "చెల్లి రావె, మంచి మల్లి రావె, కల్పవల్లి రావ్, పాలవెల్లి రావె చిక్కని చనమున్న జాబిల్లి రావె, హంస తల్లి రావె, అంటూ ప్రేమగా పిలిచాడు. వెంటనే రివ్వున ఎగిరి గౌతముని చేతులందు వాలింది. హంసను ఎవరైతే పిలిస్తే వారి వద్ద కు వస్తు ందో ఆ హంస వారిచే అవుతుంది అని న్యాయాధికారులు చెప్పారు. ఆ విధంగా హంస గౌతమునిదే అని నిర్ధా రణ జరిగింది. 3. గౌతముడు హంసకు చేసిన సపర్యల గురించి రాయండి. జ హంస గిర గిర తిరుగుతూ, అరుస్తూ , వాలిపో యి, నేలపై పడి గిజగిజలాడుతోంది. కరుణామూర్తియైన సిద్ధా ర్థు డు ఇది చూచి బిరబిరా వెళ్ళి దానిని ఎత్తు కొని తన ఒళ్ళో కూర్చుండ బెట్టు కున్నాడు. గౌతముడు హంస రెక్కలు దువ్వి, వీపు సవరించి, పాదాలు, చెక్కిళ్ళు చక్కదిద్ది, శరీరాన్ని తడిమి, ప్రేమపూర్వకమైన మాటలు మాట్లా డి, దిగులు పో గొట్టి, బుజ్జ గించి ప్రేమతో లాలనచేశాడు. 4. "హంస తీర్పు" పాఠ్యభాగ కవిని గురించి రాయండి. జ. హంస తీర్పు పాఠ్యభాగంను కరుణశ్రీ రచించారు. ఈయన అసలు పేరు జంధ్యాల పాపయ్యశాస్త్రి. కరుణశ్రీ అన్నది జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి కలం పేరు. గుంటూరు జిల్లా కొప్పర్రు వీరి జన్మస్థ లం. మహాలక్ష్మమ్మ, పరదేశయ్య వీరి తల్లిదండ్రు లు. గుంటూరు ఏ.సి. కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాలసాహిత్య కథకులుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు. వీరు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వంటి రచనలు చేశారు. 5. 'ఖండ కావ్యం' ప్రక్రియ గురించి రాయండి. జ. చిన్నకథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచన ఖండకావ్యం. దీనిలో వ్యర్ధపదాలకు, వర్ణ నలకు అవకాశం వుండదు. మహాకావ్యాలలోని రసవత్త రమైన ఘట్టా లను, పాత్రలను, చారితక ్ర , దేశభక్తి సన్నివేశాలు మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తా లలో ఛందో బద్ధ ంగా ఉంటాయి. ఆ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. దేవదత్తు డు, సిద్ధా ర్థు డు హంసను పిలిచిన మాట తీరులోని వ్యత్యాసాన్ని, ఫలితాన్ని సొ ంత మాటల్లో వ్యక్తీకరించండి. జ.. శుద్దోదన మహారాజు సభలో న్యాయాధికారి, దేవదత్త గౌతములను చూచి ఇటు రమ్మని పిలిచాడు. హంసకు కొద్ది దూరంలో నిలబడి ఒక్కొక్కరుగా వచ్చి, చేతులు చాచి, హంసను పిలవండి. అది ఎవరి చేతుల మీద వాలితే వారిదవుతుంది. దీనితో న్యాయం తేలిపో తుంది. అన్నాడు. దేవదత్తు డు హంసను ఉంచిన రత్న పీఠం వద్ద కు చేరుకొని కరుకు చేతులతో గట్టి స్వరంతో, భ్రమించిన మనస్సుతో ఖగమా ఇటురా ! ఇటురా ! అని గంభీరంగా పిలిచాడు. దేవదత్తు ని రూపాన్ని చూచో, మోసపు చూపులు చూచో, అతని చేతిలో ఉన్న ధనుస్సును చూచో, మనస్సులో భయం కలిగిందేమోగాని, దుష్టు ని హృదయాన్ని తాకలేని సంగీతంలాగా హంస వెనక్కు తగ్గి కుంగిపో యింది. తర్వాత గౌతముడు ప్రేమతో చెల్లి రావె, మంచి మల్లిరావె, కల్పవల్లి, రావె, పాలవెల్లి రావె చిక్కని చక్కదనమున్న జాబిల్లి రావె, హంస తల్లి రావె అని పిలిచాడు.. గౌతముడు చేతులు చాచి పిలవగా హంస రివ్వున వచ్చి అతని చేతిపై వ్రా లింది. 2. ఈ కథలో నీకు ఎవరి పాత్ర నచ్చింది ? ఎందుకో రాయండి. జ. ఈ కథలో నాకు గౌతముని పాత్ర నచ్చింది. అతడు ధర్మమూర్తి. జీవలోక కారుణ్యము గలవాడు. దయార్ధ హృదయుడు, దేవదత్తు డు కూల్చిన హంసను తీసుకున్నాడు. హంస గిరగిర తిరుగుతూ, అరుస్తూ , వాలిపో యి, నేలపై పడి గిజగిజ లాడుతోంది. కరుణామూర్తియైన సిద్ధా ర్థు డు ఇది చూచి బిరబిరా వెళ్లి దానిని ఎత్తు కొని తన ఒళ్ళో కూర్చుండబెట్టు కున్నాడు. గౌతముడు హంస రెక్కలు దువ్వి, వీపు సవరించి, పాదాలు, చెక్కిళ్ళు చక్కదిద్ది, శరీరాన్ని రూపకల్పన: కె.బాలకృష్ణ , పాఠశాల సహాయకులు (తెలుగు), జి.ప ఉ.పాఠశాల, వీరవల్లిపాలెం, కోనసీమ 📞 9492258533 తెలుగు పరిమళం-9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమ భాష) తడిమి, ప్రేమ పూర్వకమైన మాటలు మాట్లా డి, దిగులు పో గొట్టి, బుజ్జ గించి ప్రేమతో లాలన చేశాడు. అందువల్ల గౌతముడి పాత్ర నాకు బాగా నచ్చింది. 3. ఈ పాఠాన్ని నాటికగా ప్రదర్శించడానికి వీలుగా గౌతముడు, దేవదత్తు ల సంభాషణను రాయండి. జ. ఆకాశంలో సంచరించే హంసల గుంపును దేవదత్తు డు చూశాడు. పదునైన బాణంతో ఒక హంసను కొట్ట గా అది గౌతముని కాళ్ళ ముందరపడింది. గౌతముడు దానిని రక్షించాడు. దేవదత్తు డు : ఓ రాజకుమారా ! ఈ హంస నా భుజశక్తికి ఫలితం కనుక నాకే చెందుతుంది. గౌతముడు : ఆకాశమార్గ ంలో స్వేచ్ఛగా విహరించే హంసపై నీ రాక్షస బుద్ధి చెల్లు తుందా ? కాలికి ముల్లు గుచ్చుకుంటే బాధపడతావే! ప్రపంచంలో ఉండే సమస్త జీవుల ప్రా ణం ఒకటే కదా ! అవీ నీ వలే ప్రా ణులే ! క్షత్రియ ధర్మానికి విరుద్ధ ంగా వ్యవహరిస్తు న్నావు. దేవదత్తు డు : ఓ రాజపుత్రా ! నేను కూల్చిన హంసను దాస్తా వెందుకు ? నా పక్షిని నాకు ఇవ్వు. గౌతముడు : సున్నితమైన రాజహంస రెక్క సందున క్రూ రమైన బాణాన్ని గుచ్చి బాధించావు. ఇది నీకు తగునా ? దేవదత్తు డు : ఈ హంస నాది. గౌతముడు : నేను రక్షించాను కనుక ఇది నాది. వీరిద్దరూ ఏమీ నిర్ణ యించుకోలేక శుద్దోదన మహారాజు దగ్గ రకు వెళ్ళారు. ★ భాషాంశాలు ★ పదజాలం అ) కింది వాక్యాలు చదివి, ఎరుపు రంగులో ఉన్న పదాన్ని ఉపయోగించి అర్థా న్ని రాసి, వాటితో సొ ంత వాక్యాలు రాయండి ఉదా : మానవులు సంపదను మంచి మార్గ ంలో సంపాదించాలి. ధనాన్ని అనవసర పనులకు ఖర్చు పెట్టరాదు. 1. పిల్లలు తల్లి అంకము నందు ఆడుకుంటారు. జ. అంకము = ఒడి అమ్మ రవిని ఒళ్ళో కూర్చోబెట్టు కుని అక్షరాలు దిద్దిస్తో ంది. 2. పక్షులు వినుత్రో వలలో విహరిస్తా యి. జ. వినుత్రో వ = ఆకాశమార్గ ం ఆకాశమార్గ ం గుండా విమానాలు తిరుగుతూ ఉంటాయి. 3. ఉదయిస్తు న్న సూర్యుడు గగనకాంత ఆస్య సింధూర తిలకంలా ఉన్నాడు. జ. ఆస్యము = ముఖము ఆమె ముఖము చంద్రబింబమువలె ప్రకాశిస్తో ంది. 4. మరాళము మానస సరోవరంలో విరిసిన తెల్లకలువలా ఉన్నది. జ. మరాళము = హంస సరస్వతీ దేవి వాహనం హంస. 5. బాధితుల కళ్ళల్లో బాష్పములు జలజలా రాలుతాయి. జ. బాష్పములు = కన్నీళ్ళు పంటలు పండకపో వడంతో రైతు కళ్ళవెంట కన్నీళ్ళు జలజలా రాలినాయి. ఆ) కింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు గుర్తించి రాయండి. 1. ఆకాశంలో మేఘాలు ఆవరించినపుడు గగనం, నల్ల గా మారుతుంది. జ. అంబరము = ఆకాశము, గగనము 2. వేటగాళ్ళకు బాణాలు తయారు చేయడం అమ్ములు సంధించడం తెలుసు. జ. శరం = బాణము, అమ్ము 3. సరస్సులోని కలువలు తటాక జలాల అలలకు ఊయలలూగుతున్నాయి. జ. సరోవరం = సరస్సు, తటాకం 4. సజ్జ నుల మాటలు అమృత తుల్యాలు, వారి పలుకులు ఆత్మీయతను పంచుతాయి. జ. వాక్కులు = మాటలు, పలుకులు 5. చేతులు భూషణాలకు మాత్రమే కాదు, హస్తా లు, శ్రమించడానికి కూడా ఉపకరిస్తా యి. జ. కరములు = చేతులు, హస్తా లు రూపకల్పన: కె.బాలకృష్ణ , పాఠశాల సహాయకులు (తెలుగు), జి.ప ఉ.పాఠశాల, వీరవల్లిపాలెం, కోనసీమ 📞 9492258533 తెలుగు పరిమళం-9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమ భాష) ఇ) కింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు నానార్థా లను గుర్తించి రాయండి. 1. లక్ష్మి ఉన్న ఇంట సంపదకు కొరత ఉండదు. జ. శ్రీ = లక్ష్మి, సంపద 2. బాణము తగిలి పక్షి గాయపడింది. జ. ఖగము = పక్షి, బాణము 3. చైతమ ్ర ాసంలో తేనె విస్తా రంగా దొ రుకుతుంది. జ. మధు = తేన,ె చైతమ ్ర ు 4. ఆ పాత్రలలో నెయ్యి నీరు నిండుగా ఉన్నాయి. జ. ఘృతము = నెయ్యి, నీరు 5. పర్వత సానువులపై చంద్రు డు వెన్నెల కురిపిస్తు న్నాయి. జ. సో మ = శ్రయము, పరాక్రమము ఈ) ఈ కింది పదాలకు ప్రకృతి - వికృతి పదాలను రాయండి. పదం ప్రకృతి - వికృతి 1. లక్ష్మీ లక్ష్మి - లచ్చి 2. హంస హంస - అంచ 3. నాయము న్యాయము - నాయము రతనము. రత్నము - రతనము 5. అంకము అంకము - అంకె 6. భీతి భీతి - బీతు 7. త్రో వ త్రో వ - తోవ 8. పానము ప్రా ణము - పానము 9. రాక్షసి రాక్షసి - రక్కసి 10. సంతసము సంతోషము - సంతసము ★ వ్యాకరణాంశాలు ★ సంధులు అ) కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి. 1. కవీంద్రు డు : కవి + ఇంద్రు డు - సవర్ణ దీర్ఘ సంధి 2. మునీంద్రు డు : ముని + ఇంద్రు డు - సవర్ణ దీర్ఘ సంధి 3. భావాంబరము : భావ + అంబరము - సవర్ణ దీర్ఘ సంధి 4. ప్రేమాంకము : ప్రేమ + అంకము - సవర్ణ దీర్ఘ సంధి 5. పరమేశ్వరుడు : పరమ + ఈశ్వరుడు - గుణసంధి ★ సమాసములు అ) వాక్యంలో సమాస పదాలు గుర్తించడం ఎలా ? "అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఏకపదం కావడం సమాసం". ఒక వాక్యంలోని పదాలను నిశితంగా పరిశీలిస్తే రెండు పదాలు కలసివున్న పదం గుర్తించగలం. గుర్తించిన పదాన్ని విడి విడిగా రావాలనుకుంటే ఆ పదంలో ముందో , వెనుకో, మధ్యనో ఒక కారకం (ప్రత్యయాలు, విశేషణాలు, ఉపమానాలు, సంఖ్యలు, వ్యతిరేకార్థకాలు) వస్తు ంది. కారకాన్ని బట్టి అది ఏ సమాసమో గుర్తించగలం. ఉదాహరణకు - రాజసభ నిండుగా వున్నది. 1. రాజసభ - ఇందులో రాజ, సభ అనే పదాలు ఉన్నాయి. ఇవి రెండూ కలిసి రాజసభ అయింది. ఇది సమాస పదం. రూపకల్పన: కె.బాలకృష్ణ , పాఠశాల సహాయకులు (తెలుగు), జి.ప ఉ.పాఠశాల, వీరవల్లిపాలెం, కోనసీమ 📞 9492258533 తెలుగు పరిమళం-9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమ భాష) రాజసభ అంటే రాజు యొక్క సభ - యొక్క అనే ప్రత్యయం షష్ఠీ విభక్తికి చెందుతుంది. కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. ★ కింది వాక్యాలలో సమాస పదాలు, సమాస పదాలు కానివి గుర్తించండి. వాక్యం సమాసం కాని పదాలు సమాస పదం 1. ఆకాశంలో కలహంస ఎగురుతున్నది ఆకాశం, ఎగురుతున్నది కలహంస 2. పిల్లలు చిరునవ్వులు చిందిస్తా రు. పిల్లలు, చిందిస్తా రు చిరునవ్వులు 3. అక్కడి సభాసదులు సంతసించారు. అక్కడి, సంతసించారు సభాసదులు 4. వాడు రక్కసిబుద్ధి కలవాడు వాడు, కలవాడు రక్కసి బుద్ధి 5. కవులు కావ్య సంపద ఇచ్చారు. కవులు, ఇచ్చారు కావ్య సంపద ఆ) కింది వాక్యాలలోని ఎరుపు రంగులో ఉన్న పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు తెలపండి. ఉదా : సమస్త జీవులకు గాలి అవసరం. సమస్త మైన జీవులు - విశేషణ పూర్వపద కర్మధారయం. 1. పక్షులు అంబర వీధిలో సంచరిస్తా యి. అంబర వీధి : అంబరమనెడి వీధి - రూపక సమాసం 2. సరస్సులో మంజుల మరాళము వున్నది. మంజుల మరాళము : మంజులమైన మరాళము - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం 3. మహాకవులు కావ్యాలు రచించారు. మహాకవులు : గొప్పవారైన కవులు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం 4. పక్షులు వేటగాళ్ళ బాణహతికి చనిపో తూ ఉంటాయి. బాణాహతి : బాణము యొక్క హతి - షష్ఠీ తత్పురుష సమాసం 5. దేవదత్త శౌద్ధోదనులు స్నేహితులు. దేవదత్త శౌద్దోదనులు : దేవదత్తు డును, శుద్ధోదనుడును - ద్వంద్వ సమాసం ★ అలంకారాలు కింది ఉదాహరణలు గమనించండి. 1. ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతీ పాద లాస్యంలా ఉంది. జ. ఇక్కడ హంసల చలన విన్యాసాన్ని, సరస్వతీ పాద లాస్యంగా ఉంది అని వర్ణింపబడింది. ఉపమాన ఉపమేయాలకు సామ్య రూపమైన విన్యాసం అందంగా చెప్పబడింది. అనగా ఒక వస్తు వు మరొక వస్తు వుతో పో ల్చి చెప్పబడింది కావున ఇది ఉపమాలంకారం. 2. బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం శాపం తగిలి చల్ల ని చంద్రు డు సముద్రంలో పడడంలా ఉంది. జ. ఇక్కడి తెల్లని హంస భూమిపై పడడం, శాపం తగిలి తెల్లని చంద్రు డు సముద్రంలో పడడంలా ఉంది. ఇవ్వడు ఉపమానం ఉపమేయాలలో సమాన ధర్మం ఉంది. ఒక వస్తు వును మరొక వస్తు వుతో పో ల్చి చెప్పబడింది. కావున ఇది ఉపమాలంకారం. 3. బాణం దెబ్బకు హంస గాయపడడం రాహువు కోరల్లో చంద్రు డు చిక్కడంలా ఉంది. జ. హంస గాయపడడం రాహువు కోరల్లో చంద్రు డు చిక్కడంలా ఉందని సారూప్యాన్ని చెప్పబడింది. ఉపమానమైన రాహువు కోరల్లో చంద్రు డు చిక్కడం, ఉపమేయమైన హంస గాయపడడం. ఈ రెండింటిలోని ఒకదానిని మరొక దానితో పో ల్చి చెప్పబడడం వల్ల ఇది ఉపమాలంకారమైనది. ఉపమాలంకార లక్షణం: లక్షణం: ఉపమాన ఉపమేయాలకు ఈ రెండింటికి సామ్య రూపమైన సౌందర్యం సహృదయ రంజకంగా ఎక్కడ ఉంటుందో అక్కడ అది ఉపమాలంకారమవుతుంది. అనగా ఒక వస్తు వు మరొక వస్తు వుతో పో ల్చి చెబితే దాన్ని ఉపమాలంకారమంటారు. ఉపమాలంకారంలో నాలుగు ప్రధాన అంశాలుంటాయి. అవి. రూపకల్పన: కె.బాలకృష్ణ , పాఠశాల సహాయకులు (తెలుగు), జి.ప ఉ.పాఠశాల, వీరవల్లిపాలెం, కోనసీమ 📞 9492258533 తెలుగు పరిమళం-9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమ భాష) 1) ఉపమేయం - ఏ వస్తు వును పో లుస్తు న్నామో అది ఉపమేయం. 2) ఉపమానం - ఏ వస్తు వుతో పో లుస్తు న్నామో అది ఉపమానం 3) ఉపమావాచకం - ఉపమేయంలోను, ఉపమానంలోను సమానంగా ఉన్న ధర్మం లేక లక్షణం 4) సమాన ధర్మం - పో లిక చెప్పటానికి రెండు వస్తు వుల్లో ఉన్న సమాన గుణం. లక్ష్యం - ఓ కృష్ణా ! నీ కీర్తి హంస వలె ఆకాశగంగ యందు మునుగుచున్నది. ఇందులో కీర్తి - ఉపమేయము హంస - ఉపమానము. వలె - ఉపమావాచకము మునుగుచున్నది - సమాన ధర్మం ఈ నాలుగు ధర్మాలున్నాయి కనుక ఇది ఉపమాలంకారము. పై ఉదాహరణలలో ఉపమాన ఉపమేయాలను పో ల్చడం వల్ల ఉపమాలంకారం అవుతుంది. పాఠ్యభాగంలోని 2,6,8,22 పద్యాలలోని అలంకారాలను గుర్తించి, లక్షణ సమన్వయం చేయండి. 1. 2వ పద్యంలో : శాక్యరాష్ట ం్ర దను మానసాంబుజమునన్ మకరందము భంగి పొ ంగెనానందము జ. ఈ వాక్యంలో రూపకాలంకారముంది. ఉపమానమైన అంబుజము (పద్మము) ఉపమేయమైన మనస్సుకు అభేదము చెప్పబడింది కావున ఇది రూపకాలంకారమైంది. లక్షణము : ఉపమేయమునకు ఉపమానము తోడి అభేదాన్ని గాని, తాద్రూ ప్యాన్ని గాని వర్ణించిన యెడల రూపకాలంకారము అవుతుంది. 2. 6వ పద్యంలో : రెక్కలు దువ్వి, వీపు సవరించి....... హంసమున్ జ. ఈ పద్యంలో స్వభావోక్తి అలంకారం ఉంది. గౌతముడు చేసిన సేవలు క్రియా స్వభావాన్ని సహజ సుందరంగా వర్ణింపబడింది కావున స్వభావోక్తి అలంకారమైంది. లక్షణము: జాతి, గుణం, క్రియలు మొదలైన వాటిని ఉన్నవి ఉన్నట్లు మనోహరంగా వర్ణించి చెప్తే స్వభావోక్తి అలంకారము, 3. 8వ పద్యంలో ఎక్కడనోజనించి…….శరాగ్ను లోర్చునే జ. ఈ వాక్యంలో రూపకాలంకారముంది. ఉపమానమైన అగ్నులు, ఉపమేయమైన శరములకు అభేదము చెప్పబడింది కావున ఇది రూపకాలంకారము. 4.. 22వ పద్యంలో : చెల్లి రావే ……….. అంచ తల్లి రావె జ. ఈ పద్యంలో రెండు శబ్దా లంకారాలున్నాయి. అవి 1) వృత్యనుప్రా సాలంకారము: ద్విత్వల' కారము అనేక మార్లు పునరుక్త ం కావడం వల్ల వృత్యనుప్రా సాలంకారము 2) అంత్యానుప్రా లంకారము: 'రావె అనుపదము వాక్యాలందు అవసానంలో ప్రా సగా పాటించడం జరిగింది. కావున ఇది అంత్యానుప్రా స, లక్షణములు : 1) వృత్యనుప్రా సాలంకారము : ఒకటి గాని అంతకంటే ఎక్కువ వర్ణా లు కాని అనేకమార్లు పునరుక్త ం కావడాన్ని వృత్యనుప్రా స అని అంటారు. 2) అంత్యానుప్రా సాలంకారము : పద్య పాదాలందు గాని, వాక్యాలందు గాని అవసానంలో ప్రా సను పాటించిన దాన్ని అంత్యానుప్రా స అని అందురు రూపకల్పన: కె.బాలకృష్ణ , పాఠశాల సహాయకులు (తెలుగు), జి.ప ఉ.పాఠశాల, వీరవల్లిపాలెం, కోనసీమ 📞 9492258533 తెలుగు పరిమళం-9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమ భాష) ★ ఛందస్సు కింది పద్యపాదాలకు గణవిభజన చేసి ఏ పద్యపాదమో గుర్తించండి. పద్య లక్షణాలు రాయండి. 1. ఈయది శాస్త ్ర ధర్మ మొకయింత సహించిన లోక ధర్మమిం భ ర న భ భ ర వ UII UI U I II UII UII UIU U I ఈయది | శాస్త ్ర ధ | ర్మ మొక | యింత స | హించిన | లోక ధ | ర్మమిం ఇది ఉత్పలమాల పద్యపాదము యతి - 1 - 10 (ఈ - యిం) ప్రా స - రెండవ అక్షరము 'య' కారము. లక్షణము: 1. ఉత్పలమాల పద్యము నందు నాల్గు పాదాలుంటాయి. 2. ప్రతి పాదము నందును 'భ, ర, న, భ, భ,ర,వ' అనే గణాలు వరుసగా ఉంటాయి. 3. పాదాది అక్షరానికి ఆ పాదంలో 10వ అక్షరానికి యతి చెల్లు తుంది.. 4. ప్రా స నియమము కలదు. ప్రా స యతి చెల్లదు. 5. ఉత్పలమాల పద్యపాదము నందు మొదటి గురువును రెండు లఘువులు చేసినచో అది చంపకమాల పద్యపాదమగును. 2. గిలగిల మందువే యొరులు గిచ్చిన కాలికి ముల్లు గ్రు చ్చినన్ న జ భ జ జ జ ర III I UI UII IUI IUI IUI UIU గిలగి | ల మందు | వేయొరు | లుగిచ్చి | నకాలి | కిముల్లు | గ్రు చ్చినన్ ఇది చంపకమాల పద్యపాదం. యతి 1 - 11 (గి - గి) ప్రా స రెండవ అక్షరము 'ల' కారము, లక్షణము: 1. చంపకమాల పద్యము నందు నాలుగు పాదాలుంటాయి. 2. ప్రతి పాదము నందును 'న, జ, భ, జ, జ, జ, ర' అనే గణాలు వరుసగా ఉంటాయి. 3. పాదాది అక్షరానికి ఆ పాదంలోని 11వ అక్షరానికి యతి చెల్లు తుంది. 4. ప్రా స నియమము కలదు - ప్రా స యతి చెల్లదు. 5. చంపకమాల పద్యపాదము నందు మొదటి రెండు లఘువులను ఒక గురువు చేసినచో అది ఉత్పలమాల పద్యపాదమువుతుంది. 🙏🏻సమాప్త ము🙏🏻 రూపకల్పన: కె.బాలకృష్ణ , పాఠశాల సహాయకులు (తెలుగు), జి.ప ఉ.పాఠశాల, వీరవల్లిపాలెం, కోనసీమ 📞 9492258533

Use Quizgecko on...
Browser
Browser